12-07-2025 01:50:20 AM
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూరు, జూలై 11 (విజయ క్రాంతి): పచ్చదనంతోనే పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యపడుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మానకొండూర్ మండల కేంద్రంలోని ట్యాంక్ బండ్(చెరువు గట్టు), మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీ తనాజీ వాకడేతో కలిసి ఆయన మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్నదని, దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే కాలుష్యాన్ని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్, అటవీశాఖ రేంజర్ బుర్ర లత, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరలక్ష్మి, ఎంపీవో శ్రీధర్, ఉప తహసీల్దార్ టి.సమ్మయ్య, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రీతి, మానకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి,
మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, ద్వావ శ్రీనివాస్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి నరేశ్, బండి మల్లేశం, రేమిడి తిరుపతి, కోండ్ర సురేష్, ఎండీ ఇర్ఫాన్, మడుపు ప్రేమ్ కుమార్, చెలిగంటి సంపత్, కనకం కుమార్, సాయిరి దేవయ్య, కానిగంటి మల్లికార్జున్, తదితరులుపాల్గొన్నారు.