calender_icon.png 13 July, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరును ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతాం

12-07-2025 01:51:19 AM

  1. ఎమ్మెల్యే గూడెం గూడెం మహిపాల్ రెడ్డి
  2. రూ.2.51 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన

పటాన్ చెరు, జులై 11 :  నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు డివిజన్ ను అన్ని రంగాల్లోఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.  పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ, ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, నందన్ రతన్ ఫ్రైడ్ కాలనీలలో సీసీ రోడ్లు, యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘం స్మశాన వాటికలలో రూ. 2.51 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు  శుక్రవారం ఎమ్మెల్యే  పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలతో పాటు పట్టణంలో మౌలిక వసతులతో పాటు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పృథ్వీరాజ్,  పట్టణ ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.