calender_icon.png 13 July, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతం

12-07-2025 01:49:47 AM

  1.  పటాన్ చెరు అబ్జర్వర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్
  2.  సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం 

పటాన్ చెరు, జులై 11 : పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి బలోపేతానికి అందరు కలిసి పని చేయాలని పటాన్ చెరు అబ్జర్వర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు. పార్టీ పటిష్టానికి గ్రామ, మండల, బ్లాక్ స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం అమీన్ పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి రామ్మోహన్ తో పాటు టీజీఐఐసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి, కో అబ్జర్వర్, జనరల్ సెక్రటరీ దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై మాట్లాడారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు చురుకకుగా పని చేయాలని సూచించారు.

అనంతరం బీసీలకు 42శాతం  రిజర్వేషన్లు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీరంగూడ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్, బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరారెడ్డి, గోవర్దన్ గౌడ్, నారబోయిన శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.