calender_icon.png 24 August, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం

23-08-2025 07:50:18 PM

గచ్చిబౌలి (విజయక్రాంతి): హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకేసారి నాలుగు కార్లు ఢీకొనడంతో పలువురు స్వల్ప గాయాలకు గురయ్యారు. ఫ్లైఓవర్‌పై ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. దీంతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నాలుగు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.