23-08-2025 07:38:33 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బీర్కూరు మండలంలో వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని బీర్కూర్ మండల వ్యవసాయాధికారి కార్తీక్(Mandal Agriculture Officer Karthik) అన్నారు. డ్రోన్ ద్వారా నానో యూరియా వాడకాన్ని ఆయన ప్రయోగించారు. 500 మి.లీ నానో యూరియా 45 కిలోల సాంప్రదాయ యూరియాకు సమానమని, ఇది రైతులకు ఖర్చు తగ్గించడంతో పాటు పంట దిగుబడిని 8% పెంచుతుందని తెలిపారు. ఇది నేల, గాలి, నీటి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.