calender_icon.png 24 August, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాన్ని శక్తివంతంగా చేసే ప్రక్రియ శంభో క్రియ

23-08-2025 08:04:03 PM

సూర్యాపేట (విజయక్రాంతి): ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రాణాన్ని మరింత శక్తివంతంగా చేసే ప్రక్రియ శంభో క్రియ అని సూర్యాపేట శంభో లైఫ్ ఫౌండేషన్(Shambho Life Foundation) సభ్యులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద శంభో లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అమావాస్య రోజు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టమైనదని అన్నారు.

శంకర్ విలాస్ సెంటర్ సమీపంలోని శంభో ప్రాణ శుద్ధి కేంద్రంలో ప్రతి రోజు ఉచితంగా శంభో క్రియ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా అనారోగ్య సమస్యలు, రుగ్మతలతో పాటు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి రోజు శంభో క్రియ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగా సాధనను భాగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సాధకులు మాశెట్టి భాస్కర్ కవిత, దారం శ్రీనివాస్ రోజా, కొణతం కల్పన విజయ్ రెడ్డి, రుద్రంగి కుటుంబరావు, గుండా హరినాథ్, కొండ్లే రంగయ్య, దేవరశెట్టి అన్వేష్, గోనె విజయమ్మ, బంటు ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.