calender_icon.png 24 August, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి

23-08-2025 07:53:01 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....పోలీస్ వారికి సహకరిస్తు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని,పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.ప్రజా రవాణాకు,ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది తలెత్తకుండా గణేష్ మండపాలను పోలీస్  అనుమతితో ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి,ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన రోజున నిర్దిష్ట సమయానికి విగ్రహాలను మండపానికి చేరుకునే విధంగా నిర్వాహకులు చూసుకోవాలని,చివరి రోజు మధ్యాహ్నం నుండే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించి,నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తయ్యే విధంగా సహకరించాలన్నారు.

మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదని,ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండ ఏర్పాటు చేయలని, మండపాల వద్ద మద్యం సేవించడం,ఆసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వహకులు పై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు,బ్లూ కోల్ట్ సిబ్బంది తరచు మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. నవరాత్రి వేడుకలు సందర్భంగా మండపాల వద్ద, శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు. గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో , శోభాయాత్ర రోజున డీజే లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమార్జనం రోజున ఉపయోగిస్టే డీజే యజమానులతో పాటుగా మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది.గంటల వరకు మాత్రమే పోలీస్. అనుమతితో మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు.