23-08-2025 07:47:31 PM
రేగొండ,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రేపాక గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రేపాక గ్రామానికి చెందిన కుంట్ల లక్ష్మిరాజ్యం (50) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పొలం పనులకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు.ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వ్యవసాయ బావుల వద్ద వెతుకుతుండగా శనివారం ఉదయం కూనూరు చక్రపాణి వ్యవసాయ బావి వద్ద లక్ష్మీ రాజ్యం చెప్పులు కనిపించాయి. దీంతో గ్రామస్తులు అనుమానంతో బావిలో దిగి వెతకగా నీటిలో మునిగి ఉన్న మృతదేహం బయటపడిందని తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉండగా భార్య కుంట్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్సై కె. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.