23-08-2025 07:44:14 PM
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పనుల జాతర కార్యక్రమంలో గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే ముందుకు వెళ్తుందన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీల అలసత్వం వల్లనే నేడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కమీషన్ల కోసమే కాల్లేశ్వరం నిర్మాణం చేపట్టారని, నేడు ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచ్చిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం అన్నారు.