calender_icon.png 30 October, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక కుటుంబాన్ని పరామర్శించిన టీబీజీకేఎస్ నాయకులు

29-10-2025 06:54:07 PM

మందమర్రి (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కార్మికునికి టీబీజీకేఎస్ నాయకులు నివాళులు అర్పించారు. ఏరియా వర్క్ షాప్ లో విధులు నిర్వహించే కార్మికుడు తాళ్ళ రమేష్  అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కార్మికుని మృతి సమాచారం తెలుసుకున్న టిబిజికెఎస్ నాయకులు బుధవారం పట్టణంలోని ప్రాణహిత కాలనీలో బాధిత కార్మిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతకుముందు భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్,  సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓ రాజశేఖర్, యూత్ నాయకులు బట్టు రాజ్ కుమార్, ఏరియా నాయకులు, తోట రాజిరెడ్డి, పంజాల ఈశ్వర్, ఇప్ప సమ్మయ్య , కొండల్ రావు, కూడల తిరుపతి, తోట శ్రీనివాస్, లు పాల్గొన్నారు.