calender_icon.png 28 September, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు నిత్యావసర సరుకులు

28-09-2025 12:39:33 AM

-ఐఐఎంసీ కళాశాల ఆధ్వర్యంలో పంపిణీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్ లక్డికాపూల్‌లోని ఐఐఎంసీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవ ల కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం గుండారం గ్రామ పరిధిలోని ముంపునకు గురైన లేత మామిడి తండా, నడిమి తండా, ఎల్లాపూర్ తండా, దూప్ సింగ్ తండా, రాజంపేట్, కామారెడ్డిలోని పలు ప్రాంతాలను పరిశీలన చేసి గుర్తించిన 100 వరద బాధిత కుటుంబాలకు రూ.3లక్షల విలువ గల 15 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లు పం పిణీ చేశారు.

ఈ కిట్లలో బియ్యం, కందిపప్పు, చక్కర, రవ్వ, మొదలగు 15 రకాల సరుకులు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ కె.రఘువీర్ తెలిపారు. సరుకులతో కూడిన బస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1, 2 ప్రోగ్రాం ఆఫీసర్లు ఇ.రామకృష్ణ, సత్యనారాయణ, ఎన్సిసి ఆఫీసర్ వసంత్‌కుమార్ ఆధ్వర్యంలో ఐఐఎంసి కళాశాల, జాతీయ సేవా పథకం వలంటీర్లు 10మంది, ఎన్‌సిసి క్యాడెట్స్ 14 మంది, అధ్యాపకులు విజయ్, పచ్చిమట్ల కిషన్‌గౌడ్, నిరంజన్ పాల్గొన్నారు.