calender_icon.png 29 January, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి

29-01-2026 12:20:01 AM

డీఎంహెచ్‌ఓ 

అన్నపురెడ్డిపల్లి, జనవరి 28, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో గల అన్ని పి హెచ్ సి  లలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని డిఎంహెచ్‌ఓ  డాక్టర్ తుకారం రాథోడ్ ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని ఎర్రగుంట పిహెచ్‌ఓ  ఆకస్మికంగా  తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. సిబ్బంది సదుపాయాలపై వైద్యాధికారి ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, హాస్టల్స్ లో ప్రతినెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేకంగా హాస్టల్స్ లో చదివే పిల్లలకు రక్తహీనత, ఆరోగ్యం పై శ్రద్ధ వహించేలా ఆరోగ్య విద్యాబోధన చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని, గర్భిణీ మహిళల వివరాల నమోదు, వారి ఆరోగ్య పరీక్షలను పరీక్షించి మెరుగైన వైద్య సదుపాయం కోసం రామవరం పి హెచ్ సి కి పంపాలని సూచించారు.