calender_icon.png 29 January, 2026 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న ఐసెట్, 20న ఎడ్‌సెట్

29-01-2026 12:20:43 AM

నోటిఫికేషన్ల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): టీజీ ఐసెట్, ఎడ్‌సెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయం లో ఏర్పాటు చేసిన సెట్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 6న ఐసెట్ నోటిఫికేషన్, ఫిబ్రవరి 20న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. 12 నుంచి మా ర్చి 16 వరకు ఐసెట్‌కు దరఖాస్తులు స్వీకరణ చేపట్టనున్నారు. మే 13, 14న పరీక్ష నిర్వహిస్తా రు. ఇక ఎడ్‌సెట్‌కు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను మే 12న రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు.