15-05-2025 02:09:13 AM
కరీంనగర్ క్రైం, మే14(విజయక్రాంతి): కరీంనగర్ లోని కురుమవాడ బాల భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ దీక్షాప రులు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. గత 13 రోజులుగా స్వాములు అభిషేకాలతోపాటు హనుమాన్ చాలీసా, భజనలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు బుధవారం రోజు హనుమాన్ దీక్షాపరులకు బిక్ష కార్యక్రమం చేపట్టారు.
మంకమ్మ తోటకు చెందిన పొద్దుటూరి నాగేందర్, పొద్దుటూరి రాజేందర్, పొద్దుటూరి మహేందర్ లు మెడికల్ రంగంలో పనిచేస్తున్నారు. వీరు నేటి బిక్షకు దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుండి పెద్ద హనుమాన్ జయంతి వరకూ కొత్త జయపాల్ రెడ్డి కూరగాయల దాతగా వ్యవహరి స్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బాల భక్తాంజనేయ స్వామి ఆలయ అర్చకులు చింతల రమేష్, జాతర కొండ శ్రీని వాస్, సంద అశోక్, శ్రీ రామోజీ శ్రీధర్, వడమళ్ళ సతీష్, వెంగళ శ్రీనివాస్, ఇంజపూరి ప్రవీణ్, ఎం మల్లేశం, ఏ శ్రీనివాస్, పెద్ది గట్టయ్య, భాను, ఆటో విజయ్, మహిళా సేవకులు సరస్వతి, రజిత, లక్ష్మిస, రాధిక, మమత, మాధవి, తదితరులు పాల్గొన్నారు.