13-10-2025 12:05:45 AM
సగం ప్రేమికులూ.. ప్రేమించకండి
సగం స్నేహితులూ వినోదించకండి,
సగం నైపుణ్యం గలవారి పనుల్లో మునిగిపోకండి,
సగం జీవితాన్ని జీవించకండి
సగం చావూ చావకండి !
ఒకవేళ నీవు మౌనస్థితిని ఎంచుకుంటే
అపుడు మౌనంగా ఉండిపో
అదే నీవు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు
పూర్తి చేసేవరకూ అట్లాగే మాట్లాడుతూ ఉండు
ఏదైనా మాట్లాడేది ఉన్నప్పుడు నీలో నీవే
సమాధానపరచుకుని మౌనంగా ఉండిపోకు
మౌనంగా ఉండాలని నీకు నీవే చెప్పుకోకు!
ఒకవేళ నీవు దేన్నునా అంగీకరిస్తే, అపుడు దానిని
ముక్కుసూటిగా చెప్పేసేయ్ దానికి ఏ ముసుగూ వేయకు!
ఒకవేళ నీవు దేన్నునా తిరస్కరిస్తే,
అపుడు దాని పట్ల స్పష్టంగా ఉండు,
సందిగ్ధతిరస్కరణనిర్బల
అంగీకారమౌతుంది కానీ, మరేదీ కాదు!
సగం పరిష్కారాన్ని ఎపుడూ అంగీకరించకు,
సగం సత్యాలను ఎపుడూ విశ్వసించకు,
సగం స్వప్నాన్ని స్వప్నించకు,
సగం ఆశల పట్ల ఊహల్లో స్వేచ్ఛగా తేలిపోకు!
సగం ద్రవస్వీకారం నీ దాహాన్ని చల్లార్చదు,
సగం ఆహారం నీ ఆకలిని తృప్తిపరచదు,
సగం దారి నిన్నెక్కడికీ తీసుకువెళ్లదు,
సగం ఆలోచన నీకు ఫలితాలను పుట్టించి ఇవ్వదు.
నీ మరో సగం నీ ప్రేమికకు (పూర్ణ) ప్రేమికుడు కాలేడు,
మరో వేళ అయినా కూడా ఇదే స్థానంలోనే ఉంటావు నీవు,
నీవు నిండుగ ఒక్కడివి కానప్పుడు ఇదే నీవు, ఇంతే నీవు !!
(ఆంగ్లమూలం: ఖలీల్ జిబ్రాన్)