08-09-2025 12:00:00 AM
నియామక పత్రం అందుకున్న నర్సింగ్ రావు
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : హిందుస్థానీ అవామ్ మోర్చ (సెక్యులర్) కార్మిక విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా చిప్పల నర్సింగ్ రావు నియమితులయ్యారు. మేడ్చల్ జిల్లా ఉమ్మడి ఘట్ కేసర్ మండలం కొర్రెములకు చెందిన చిప్పల నర్సింగ్ రావు తెలంగాణ- దళిత బహుజన ఉద్యమకారుడిగా, జాతీయ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా సేవలందించారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన డిల్లీలో జరిగిన కాన్సి స్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా సమావేశంలో పాల్గొన్నారు. హెచ్‌ఎం (సెక్యులర్) పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంజీసింగ్ నర్సింగ్ రావును తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈమేరకు కేంద్రమంత్రి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి జితన్రాం మంజీహీ, జాతీయ అధ్యక్షులు-బీహార్ రాష్ట్ర మంత్రి డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్ ల చేతుల మీదుగా చుక్కల నర్సింగ్ రావు నియాయక పత్రం అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిజెపికి కూటమిగా హిందు స్థానీ అవామ్ మోర్చ (సెక్యులర్) పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్ర మంలో హెచ్‌ఎం (ఎస్) జాతీయ ప్రధానకార్యదర్శి సుష్మప్రియదర్శిన, లోక్ శివ తదితరులు పాల్గొన్నారు.