calender_icon.png 13 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి సోమవారం ‘విద్యుత్ ప్రజావాణి’

13-05-2025 01:01:18 AM

జగిత్యాల సర్కిల్ సూపరింటెండెంట్ సాలియా నాయక్

జగిత్యాల అర్బన్, మే 12 (విజయక్రాంతి):  విద్యుత్ వినియోగదారులకు మరింత  చేరువై వారి సమస్యల పరిష్కారమే  ధ్యేయంగా ప్రతి సోమవారం  ”విద్యుత్ ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించి  వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నామని జగిత్యాల సర్కిల్  సూపరింటెండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు.

గత సంవత్సరం జూన్ 17న  ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా  ఇప్పటి వరకు 706 ఫిర్యాదులు రాగా, 600 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు.   సర్కిల్  పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాలు  సర్కిల్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు .

డివిజన్ ఆఫీస్ , ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్లో  ప్రతి సోమవారం ‘ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు, సర్కిల్ ఆఫీస్ లో అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు  ఫిర్యాదులు చేయవచ్చన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.