calender_icon.png 26 November, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందడమే ప్రభుత్వ లక్ష్యం

26-11-2025 12:00:00 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, నవంబర్ 25 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల పరిధిలో మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో  కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా చందూర్ చెరువులో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. చేపల పెంపకదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. మేడిపల్లి గ్రామంలో రూ.11 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాంను ప్రారంభించారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో రూ. 30 లక్షలతో నిర్మించిన సొసైటీ సబ్సెంటర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు.

చందూర్ మండల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అన్నారు.గ్రామీణ ప్రజలు, రైతులు, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చందూర్, మోస్రా, వర్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

గాంధారి నవంబర్ 25 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం రోజున నియోజకవర్గం లోని  పర్యటన లో భాగంగా గాంధారి మండల కేంద్రం లోని  ప్రజల, రైతుల  చిరకాల కోరిక అయినా పోచమ్మ రేవు బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతు..  గాంధారి మండల కేంద్రంలోని పొచమ్మ రేవు వద్ద రూ.4.9 కోట్ల వ్యయంతో నిర్మించబోయే హై లెవల్ బ్రిడ్జ్కు శంకుస్థాపన ఈ రోజు చేయడం జరిగింది అని గత 30 ఏళ్లుగా గాంధారి వాసులు ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం నేడు నిజమైంది అని అయన అన్నారు.సంవత్సరాల తరబడి సమస్యలు ఎదుర్కొన్న రైతులకు ఈ వంతెన గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది అని అభిప్రాయ పడ్డారు.గడప గడపకు కార్యక్రమం లో భాగంగా  ఇచ్చిన హామీని పూర్తి చేయడం జరిగింది అని అయన అన్నారు.

నిలబెట్టుకుని, మాట నిలబెట్టిన నాయకుడిగా మరొకసారి నిరూపించుకున్న ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు గంధారి ప్రజలు తెలిపారు.ఈ శంకుస్థాపనతో గాంధారి ప్రజల అభివృద్ధి ప్రయాణంలో ఇది చారిత్రాత్మకమైన అడుగుగా నిలిచించింది అని అయన అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు తన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు.

మహిళల అభివృద్ధి కేవలం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందని మహిళల కోసమే రాష్ట్రంలో అనేక  పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో  మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్, గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్, గాంధారి మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు, గాంధారి సొసైటీ డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగని బాబా , మండల నాయకులు క్రిష్ణ, మదర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.