19-09-2025 12:05:41 AM
ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి టౌన్ సెప్టెంబర్ 18: ప్రతి పేదవాడికి ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు సి ఏం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబందించి ప్రభుత్వం నుండి మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమం లో ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు