calender_icon.png 27 December, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి

27-12-2025 01:51:21 AM

* టీఆర్‌ఈఐఎస్ సొసైటీ కార్యదర్శి రమణ కుమార్

మునిపల్లి, డిసెంబర్ 26 : గురుకుల పాఠశాలలో చదివే ప్రతి  విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు కు సాగాలని టీఆర్‌ఈఐఎస్ సొసైటీ కార్యదర్శి రమణ కుమార్  సూచించారు. శుక్రవారం  మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి  తరగతి గదులు, నూతనంగా ఏర్పాటు చేసిన డార్మెరీని,  డైనింగ్ హాల్ను సందర్శించి అక్కడ ఉపయోగిస్తున్న కూరగాయలను పరిశీలించారు. స్టోర్ రూమ్ను కూడా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థులు క్రమశిక్షణతో అలవర్చుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం  విద్యార్థులకు కల్పించిన అకామిడేషన్ విధానాన్ని పరిశీలించడంతో పాటు  డబుల్ డెక్కర్ మంచాల పక్కన ట్రంక్ బాక్స్లు పెట్టుకునేందుకు ఏర్పాటు చేసిన టేబుల్స్ సౌకర్యవంతంగా ఉన్నాయని అభినందించారు. అలాగే  అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపా ధ్యాయులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు ప్రశాంత్ చారి, ఎన్. విఠల్,  పుష్పలత, లక్ష్మణ్ గౌడ్, వెంకటేశం, రామ్ బ్రహ్మం తదితరులు ఉన్నారు.