27-12-2025 01:53:12 AM
- అంతరాలు లేని సమసమాజ స్థాపనే లక్ష్యం
- మంద పవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి,సిద్దిపేట ఘనంగా గజ్వేల్ లో సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు
గజ్వేల్, డిసెంబర్ 26: దేశంలో ఎర్రజెండా లేని, కమ్యూనిస్టులు లేని పోరాటాలు లేవని,పేదల పక్షాన నిరంతరం సీపీఐ పార్టీగా పోరాడుతామని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ కేంద్రంలో సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు భారీ నిర్వహించారు. అనంతరం ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద సీపీఐ పతాకాన్ని మంద పవన్ ఆవిష్కరించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ కాన్పూర్లో ఆవిర్భావం నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన ఘనత ఉందని చట్టసభల్లో కార్మికుల, కర్షకుల విద్యార్థులకు అనేక చట్టాలు చేసినటువంటి ఘనత సిపిఐ పార్టీకి ఉన్నదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి నిరుపేదలకు భూమిని పంచిందని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలకపాత్ర పోషించి తెలంగాణ సాధించడంలో ముందు వరుసలో ఉందన్నారు.
బడుగు బలహీన వర్గాల కోసం,విద్యార్థులకోసం,యువత కోసం,మహిళలకోసం,నిరంతరం వారి హక్కుల కోసం,ప్రజల పక్షాన కార్మికుల కర్షకుల పక్షాన పోరాటలు చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ అన్నారు. సిపిఐ పార్టీకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల జనవరి 18 న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు కార్మికులు కర్షకులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టు దయనందరెడ్డి, జేరిపోతుల జనార్థన్, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి శివలింగు కృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, మండల సహాయ కార్యదర్శి కొండంగి పోచయ్య బొడ్ల సాయిలు, చింత శ్రీను, కానుగుల రమనకర్, కార్మిక సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.