calender_icon.png 27 December, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫాయి కార్మికుల జీతాలు పెంచాలి

27-12-2025 01:49:42 AM

ఎమ్మార్పీఎస్ నాయకుడు మురళి మాదిగ

తూప్రాన్, డిసెంబర్ 26 : సఫాయి కార్మికులకు ప్రస్తుతం అందుతున్న జీతానికి అదనంగా మరో 5,000 పెంచాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. సఫాయి కార్మికులు సంతోషంగా ఉంటేనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని, గ్రామాల అభివృద్ధితోనే ప్రజల జీవన ప్రమాణా లు మెరుగవుతాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు మురళి మాదిగ అన్నారు.గత కొన్ని నెలలుగా మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం లేకపోవడంతో జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం పాలకవర్గం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు స్పందించి పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. జీతాల పెంపుతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.