calender_icon.png 28 September, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ సిద్ధంగా ఉండండి

28-09-2025 01:32:02 AM

జూనియర్ ఎన్టీఆర్‌ేొకొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా ‘దేవర’. గత ఏడాది సెప్టెంబర్ నెలాఖరున రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించింది. విడుదలకు ముందే ఈ సినిమాకు పార్ట్-2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే పార్ట్-1లో కథను సగమే చూపించారు. అయితే నెలలు గడుస్తున్నా సీక్వెల్‌పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. పార్ట్1 విడుదలై ఏడాది పూర్తయింది. ‘దేవర2’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో, అసలు పార్ట్2 ఉంటుందా.. లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

సరిగ్గా ఏడాది తర్వాత ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. తాజాగా ‘దేవర2’పై చిత్రబృందం ఓ కీలక అప్డేట్ పంచుకుంది. ‘దేవర’ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ సీక్వెల్ పోస్టర్‌ను సోషల్‌మీడియాలో రిలీజ్ చేసింది. అందరూ ‘దేవర2’ కోసం సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్ పెట్టింది. ‘ప్రతి సముద్ర తీరాన్ని వణికించి నేటికి ఏడాది పూర్తయింది. ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునే పేరు దేవర.

అది తాను సంపాదించిన ప్రేమ అయినా, తాను చూపిన భయం అయినా.. ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు ‘దేవర2’ కోసం అందరూ సిద్ధంగా ఉండండి’ అని ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా ‘దేవర2’ టైటిల్ లోగోతో కూడా పోస్టర్ షేర్ చేశారు. దేవరగా ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున కూర్చున్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ‘దేవర2’ పట్టాలెక్కునుందన్న విషయం తాజా అప్‌డేట్‌తో స్పష్టమైంది.