calender_icon.png 28 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యారడైజ్ నుంచి శికంజ మాలిక్ వచ్చాడు

28-09-2025 01:30:51 AM

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరో నాని పోషిస్తున్న పాత్రకు ‘జడల్’ అని విచిత్రమైన పేరును ప్రకటించడంతోనే సంచలనం సృష్టిం చిందీ సినిమా. ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్‌బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఇంతకాలం ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ సినిమాలో కలెక్షన్ కింగ్ ఓ పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు.

మోహన్ బాబు పాత్రను ‘శికంజ మాలిక్’గా పరిచయం చేస్తూ ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. టీమ్ విడు దల చేసిన రెండు పోస్టర్లు మోహన్‌బాబు ఐకానిక్ చారిష్మాను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి. షర్ట్ లేకుండా గన్, కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ రగ్గడ్, ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఓ పోస్టర్ అదిరిపోయింది. మరో లుక్‌లో రెట్రో అవతార్‌లో సిగార్ కాలుస్తూ భుజంమీద గన్ పెట్టుకొని స్వాగ్‌తో నడుచుకుంటూ వస్తున్నట్టున్న లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఈ రెండు లుక్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లెజెండరీ మోహన్‌బాబును చాలా కాలం తర్వాత బిగ్‌స్క్రీన్‌పైకి తీసుకువస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. పవర్‌ఫుల్ విలన్‌గా చూపించబోతున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; డీవోపీ: సీహెచ్ సాయి; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.