calender_icon.png 19 November, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రిలో హెచ్‌ఈఓ, ఆయా తప్ప అందరూ గైర్హాజరే..

19-11-2025 12:47:33 AM

అహ్మదీపూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా అతనికి చేసిన కలెక్టర్ 

గజ్వేల్, నవంబర్ 18 : గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ఈఓ, ఆయా తప్ప అందరూ గైహాజరయ్యారు. మంగళవారం గజ్వేల్ మండలంలోని అ హ్మదీపూర్ పిహెచ్ సి ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.

సమయం ఉదయం 9.34 గంటలు అయిన కూడా ఎచ్ ఈ ఓ సత్యనారాయణ రెడ్డి, ఆయమ్మ తప్ప మెడికల్ ఆఫీసర్ తో సహా మిగిలిన సిబ్బంది అందరూ గైర్హాజరు కావడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి గైర్హాజరు అయిన వారి వివరాలను నమోదు చేసి ఒక రోజు జీతం కోత విధించాలని, సమయానికి రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డి ఎం అండ్ ఎచ్ ఓ నీ ఫోన్ ద్వారా ఆదేశించారు.