18-12-2025 12:51:48 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సభాపతి ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, ఇరు పక్షాల వాదనలు విని మెరిట్ ఆధారంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. బుధవారం ఆయన సీఎల్పీ కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌పైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
స్పీకర్ తీర్పుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఫిరాయింపులపైన మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకున్న విషయం మర్చిపోయారా..? అని విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు.