18-12-2025 12:52:19 AM
ఈ నెం 20 నుంచి ప్రారంభం
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): నగరంలో హైటెక్స్ ఆధ్వర్యంలో 18 వ హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ (హెకెఎఫ్ 2025) నిర్వహించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హాల్ -1లో ఈ ఫెయిర్ జరగ నుంది. ఇందుకోసం హైటెక్స్ పెరల్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కర్టెన్, రైజర్ ప్రెస్ మీట్‌లో హైటెక్స్ బిజినెస్ హెడ్ టి.జి. శ్రీకాంత్ హెకెఎఫ్ అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ‘18వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్, భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన పిల్లల ఎక్స్‌పోలలో ఒకటిగా ఎదిగింది. వినోదం, విద్య, సృజనాత్మకత, ఫిట్‌నెస్, కుటుంబ వినోదం అన్నింటినీ సమతుల్యం చేసే వేదిక ఇది,” అంటూ వివరించారు. రెండు రోజుల ఫెయిర్‌కు 25,000 మందికి పైగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉండగా 50కి పైగా ఎగ్జిబి టర్లు పాలుపంచుకుంటారు.
న్యూట్రిషన్, విద్య, లైఫ్‌స్టుల్, బొమ్మలు, పుస్తకాలు, హాబీ లు తదితర విభాగాలకు చెందిన అనేక ఉత్పత్తులు, సేవలు ఈ ఫెయిర్‌లో ప్రదర్శించను న్నారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా కిడ్స్ బిజినెస్ కార్నివల్ (రెండో ఎడిషన్) నిర్వహించనున్నారు.
ఇందులో 60 మందికి పైగా చిన్నారుల వ్యాపారవేత్తలు తమ ఆలోచనలు, ఉత్పత్తులను ప్ర దర్శించనున్నారు. హెకెఎఫ్ 2025లో పిల్లల కోసం అనేక ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్ జోన్లు ఉండను న్నాయి. ప్రతిరోజూ లక్కీ డ్రాల ద్వారా రూ.5 వేల విలువైన షాపర్స్ స్టాప్ వోచర్లు గెలుచుకునే అవకాశం కల్పించనున్నారు. హైదరా బాద్ కిడ్స్ ఫెయిర్ టికెట్స్ బుక్ మై షో ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.