calender_icon.png 28 September, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈత చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

28-09-2025 05:11:27 PM

మంథని (విజయక్రాంతి): మంథని సమీపంలోని కూచిరాజ్ పల్లి తాటి వనంలో ఆదివారం నిచ్చెనపై నుండి ఈత కళ్ళు గీస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన కింద పడిపోవడంతో గంగాపురికి చెందిన కల్లుగీత కార్మికుడు తాటి రాజు గౌడ్(42)కు స్వల్ప గాయాలయ్యాయి. గీత కార్మికుడు ముళ్ళ పొదల్లో పడిపోవడంతో ముళ్ళు గుచ్చుకొని, తలకు, కాళ్లకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయాలపాలైన రాజు గౌడ్ ను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.