26-09-2025 11:33:47 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని చిన్న సిద్దాపూర్ గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్య విన్నవించారు. ముందుగా కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో ఆయనకు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం సమర్పించారు. త్వరలో అటవీ శాఖ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే నిర్వహిస్తామని తెలిపినట్లు రైతులు తెలిపారు.