31-01-2026 12:00:00 AM
టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ వర్ధంతి సంద ర్భం గా శుక్రవారం తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీఎన్జీవో) అధ్యక్షులు మారమ్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్), తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యం లో హైదరాబాద్ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆయనకు ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా టీఎన్జీఓల కేంద్ర సంఘం అధ్యక్షులు జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) మాట్లాడుతూ అహింస, సత్యం అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా చేసిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.
ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమాజ సేవలో ఉద్యోగుల పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) అధ్యక్షులు చావ రవి, కార్యదర్శి శ్రీ లింగారెడ్డి పాల్గొని గాంధీజీ త్యాగాలను స్మరించుకున్నారు. అలాగే టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ తమ ప్రసంగాల్లో గాంధీజీ చూపి న మార్గంలో నడవడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు. వీరితో పాటు అసోసియేట్ ప్రెసిడెంట్ కేఆర్ రాజ్ కుమా ర్, ఖలీద్ అహ్మద్, వైదిక శేష్ర, ఏవీ శ్రీధర్, కేంద్ర సంఘం ప్రతినిధులు కొం డల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, గీత తదితరులు పాల్గొ ని మహాత్మ గాంధీకి నివాళులర్పించారు.