calender_icon.png 23 August, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ సిబ్బంది పనితీరుకు సాక్ష్యం

23-08-2025 12:05:40 AM

రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక లోనే తప్పులు 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22, (విజయక్రాంతి) జిల్లాలో ఏ ప్రభుత్వ శాఖ అధికారి అయిన ఇచ్చిన సంవత్సరంలో తప్పులు దొరల వచ్చేమో కానీ, సాక్షాత్తు జిల్లా బాస్ కలెక్టర్ ఇచ్చిన ఏ సమాచారమైన ఎలాంటి తప్పులు ఉండవనేది జగమెరిగిన సత్యం. జిల్లా అధికారి పత్రాల్లో అంతటి శక్తి ఉంటుంది. జిల్లా పరిపాలనలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్న జిల్లా కలెక్టర్ నుంచి విడుదలయ్యే సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారి చీఫ్ సెక్రటరీ కి చేరుతుంది.

అంతటి ప్రాముఖ్యత గల సమాచారం లోనే జిల్లా కలెక్టర్రేట్ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొ చ్చినట్లు కనిపిస్తోంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో చోటుచేసుకుంది. భద్రాచలం గోదావరి వరదలకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి చేరుతుంది. ఆ సమాచార పత్రాన్ని జిల్లా పౌర సంబంధాల అధికారి శుక్రవారం విడుదల చేశారు.

ఆ పత్రంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కలెక్టర్ కార్యాలయం నుంచి నేరుగా కలెక్టర్ పేషీలోనే ఇంతటి నిర్ల క్ష్యం నెలకొన్నదా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్యాక్స్ మెసేజ్ పంపినట్లుగా పేర్కొన్న పత్రంలో గోదావరి వరదలు 2025 కు బదులు, గోదావరి వరదలు 2024అని తెలియజేయడం గమనారహం. అంతేకాకుండా అత్యంత కీలకమైన ఆర్ సి నెంబర్ లోను అదే తప్పును పునరావృతం చేయడం, గత ఏడాది ఇచ్చిన సమాచార పత్రంలోనే మార్పులు చేసి తాజాగా పంపినట్లు స్పష్టమవుతుంది.

మార్పులు చేసే విధానంలోనూ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపించింది. జిల్లా కార్యాలయంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే కిందిస్థాయి అధికారుల్లో ఇంకెంతటి ఘోరం ఉందోనని అనుమానాలు తలెత్తుతున్నాయి. కలెక్టర్ స్పందించి ఈ అంశంపై విచారణ చేసి అందుకు బాధ్యులైన అధికారులు సిబ్బంది పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు అనేది మే ధావుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.