23-08-2025 12:05:13 AM
కామారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి), పేద గ్రామీణ పట్టణ రెడ్డిలకు విద్య అందించాలని సదుద్దేశం రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి దని రెడ్డి సంఘాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాసం పల్లి శివారులో 44వ జాతీయ రహదారి పక్కన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 165 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి హాజరై మాట్లాడారు.
రాజాబహాద్దూర్ వెంకట్రామారెడ్డి హైదరా బాద్ నగరంలో నైజాం కాలంలోనే హాస్టల్, పాఠశాలలు ,కళాశాలను ఏర్పాటు చేసి విద్యాభివృ ద్ధికి కృషి చేశారని అన్నారు. వెంకట్ రామ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి భాటలో మనం కూడా నడవాలని అన్నారు. కామారెడ్డి రెడ్డి సంఘాల ట్రస్ట్ ఆద్వర్యంలో త్వరలోనే హస్టల్ ,పాఠశాల , వృత్తి నైపుణ్య శిక్షణ కొరకు భవనాల నిర్మాణం ప్రారంభించడానికి సన్నాహ లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ నాగర్తి చంద్ర రెడ్డి, కొప్పుల గంగారెడ్డి, గడ్డం రమేష్ రెడ్డి, మల్లారెడ్డి, కరుణాకర్ రెడ్డి, కొలిమి భీమ్ రెడ్డి, రాజిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రతాపరెడ్డి, బాపిరెడ్డి, సిద్ధరాంరెడ్డి, బాప్ రెడ్డి, నరేష్ రెడ్డి, జగన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.