calender_icon.png 25 December, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలన్నీ చెల్లించండి

25-12-2025 01:56:35 AM

  1. పెన్షనర్ల డిమాండ్
  2. రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఒక్కరోజు నిరాహారదీక్ష
  3. పలు జిల్లాల్లో ధర్నాలు

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాం తి): తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన పింఛను బకాయిలన్నింటినీ చెల్లించాలని ప్రభుత్వ పెన్షనర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ పింఛన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు మేరకు రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. పలు జిల్లా కేంద్రాలు, మం డల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

పెన్షన్లు పెండింగ్‌లో ఉండటంతో డబ్బులు లేక పిల్లల వివాహాలు చేయలేకపోతున్నామని, సొంత ఇళ్లు కూడా కొనలేని దీనస్థితిలో జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యానికి గురైతే ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నామని వాపోయారు.

ప్రభుత్వం స్పందించి తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని కోరు తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిరాహార దీక్షలో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య మాట్లాడారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలో కొంపెల్లి భిక్షపతి పాల్గొన్నారు.