19-07-2025 12:25:47 AM
-ఊరికి కనీసం 5 బెల్ట్షాపులు
-డిమాండ్ ఉన్న సరుకు ఆ దుకాణాలకే సరఫరా
-ఎమ్మార్పీపై క్వార్టర్కు రూ.30 అదనపు వసూళ్లు
నల్లగొండ టౌన్, జులై 17 : నెలవారీగా భారీ మొత్తంలో జీతం కన్నా గీతం ఉండడంతో ఎక్సైజ్ అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారు. మద్యం విక్రయాలను బంగారు బాతుగా భావిస్తున్న పోలీసులు నెలవారీ మామూళ్లతో వైన్స్ డీలర్లు చెప్పిందే వేదంగా నడుచుకుంటున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మద్యం వ్యాపారం అంతా బెల్ట్షాపుల ద్వారానే సాగుతోంది. దీంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు, ఆరోగ్యానికి తూట్లు పడుతున్నాయి.
బెల్ట్షాపుల నిర్వహణ నిబంధనలకు విరుద్దం కాగా, మొత్తం వ్యవస్థే ఆ దుకాణాల్లో సాగుతుందంటే జిల్లాలో అధికారుల పనితీరు ఇట్టే తెలిసిపోతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 336 మద్యం దుకాణాలుండగా,ఇవి పేరుకే పరిమితమయ్యాయి. వైన్స్ డీలర్లు, ఎక్సైజ్, పోలీస్ అధికారులు ఎవరికి వారు జేబు నిం పుకునే పనిలో పడడంతో వ్యవస్థ నీకింత.. నాకింత అనే విధంగా తయారైంది.
నిబంధనల మేరకు మద్యం విక్రయి స్తే వైన్స్ డీలర్కు చీప్ లిక్క్పన 20శాతం, బీర్లపైన 20 శాతం,ఇతర బ్రాండ్లపైన 14.5శాతంమార్జిన్ ఉంటుంది. అ యితే అత్యాశతో వైన్స్ యజమానులు లిక్కర్ కంపెనీల సేల్స్మెన్స్ ఇచ్చే అదనపు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నా రు.డిమాండ్ లేని మ్యాక్డోల్ కంపెనీ మద్యం బ్లాక్బస్టర్, ఖ ర్జూరా, ట్యూబర్గో, రాయల్చాలెంజ్ వంటి బీర్లను ఎక్కువగా విక్రయిస్తే అదనంగా ముట్టజెబుతామని కంపెనీల సేల్స్మె న్లు ప్రోత్సహిస్తుండడంతో వైన్స్ నిర్వాహకులు వాటినే విక్రయిస్తూ మద్యం బాబులు కోరుకునే బ్రాండ్లను పక్కనబెడుతున్నారు.
బెల్ట్షాపులకు బ్రాండ్ మద్యం..
మద్యం బాబులు కోరుకునే బ్రాండ్లను వైన్స్ నిర్వాహకు లు తెలివిగా బెల్ట్షాపులకు మళ్లిస్తూ డిమాండ్లేని బ్రాండ్లను వైన్స్లలో విక్రయిస్తూ రెండువైపులా ఆర్జిస్తున్నా రు. డిమాండ్లేని బ్రాండ్ విక్రయించి కంపెనీ సేల్స్మెన్ల నుంచి అదనంగా లబ్ధి పొందుతున్నారు. మరోవైపు డిమాం డ్ ఉన్న సరుకునే బెల్ట్షాపులకు వేసి ప్రతి క్వార్ట్పన ఎమ్మార్పీకి అదనంగా రూ.10 వసూళ్లు చేస్తున్నారు. ఇక బెల్ట్షాపు నిర్వాహకులు ప్రతి క్వార్ట్పన రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
ఎమ్మార్పీపై వైన్స్ డీలర్లు అదనంగా రూ.10 బాదుతుండగా బెల్ట్షాపు నిర్వాహకులు మరో రూ.30 అదనపు భారం మోపుతున్నారు. మొత్తంగా ఒక క్వార్టర్ బాట్పి మద్యం ప్రియులు రూ.30 నుంచి రూ.40 వరకు చెల్లించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు అదనంగా మద్యం ప్రియుల నుంచి డీలర్లు, బెల్ట్షాపుల నిర్వాహకులు పిండేస్తున్నారు. కోరిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేవు, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలంటూ బుధవారం కట్టంగూరు మండలం అయిటిపాములకు చెందిన మద్యం ప్రియులు స్థానిక వైన్షాపు ఎదుట ధర్నా నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
సిండికేట్ దందా..
సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయమే కీలకం కావడంతో ప్రభుత్వం, అధికారులు ఈ అంశాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నెలనెలా మద్యం విక్రయాలు పెరగడమే లక్ష్యం. ఇక మిగిలిన అంశాలన్నీ గాలికి వదిలేస్తున్నారు. హైదరాబాద్లోని ఉన్నతాధికారు లు నెలవారీ మద్యం విక్రయ టార్గెట్లపై దృష్టి పెడుతుండగా, ఇదే సాకుగా తీసుకుని జిల్లాలోని ఎక్సైజ్, పోలీస్ అధికారులు జేబులు నింపుకునే పనిలో పడ్డారు.
వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని వైన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పట్టణాల్లో వైన్స్ నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడ్డారు. వారి దుకాణాలకు సంబంధించిన స్టాక్ అంతా ఒక గోదాంకు చే రుస్తున్నారు. అక్కడ సీసాలపై వారి సిండికేట్ను గుర్తించేలా ప్రత్యేక స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఆ పట్టణ పరిధిలోని బెల్ట్షాపుల్లో సంబంధిత స్టిక్కరు ఉన్న మద్యాన్నే విక్రయించాలి. బెల్ట్షాపు నిర్వాహకులు ఎక్కడైన సిండికేట్లేని చోట దూర ప్రాంతాల నుంచి సరుకు తెచ్చి విక్రయిస్తే ఎక్సైజ్, పోలీస్ అధికారులతో దా డులు చేయిస్తూ, వేధింపులకు దిగుతున్నా రు.