18-08-2024 12:17:11 AM
ఎక్సైజ్ సుంకం చెల్లించని మద్యం బాటిళ్ల పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి) : నగరంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్‌కుమార్, ముకుందారెడ్డి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో పలువురు వ్యక్తుల నుంచి 100 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్ నల్లకుంటకు చెందిన సడిమెల హరికృష్ణ వద్ద కర్ణాటకకు చెందిన 10మద్యం బాటిళ్లు, ఈసీఐఎల్‌కు చెందిన కందాడి రఘునాథరెడ్డి వద్ద ఢిల్లీ, గోవా, ఇతర దేశాలకు చెందిన 90మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ దాడుల్లో మల్కాజ్‌గిరి ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ కుమారస్వామి, సిబ్బంది.. వీరేష్, వీరలక్ష్మి, కవిత తదిరతులున్నారు.