calender_icon.png 22 November, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు హాష్ ఆయిల్ విక్రేతల అరెస్ట్

18-08-2024 12:16:26 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఆదిభట్ల ప్రాంతంలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మహేశ్వరం జోన్ ఎస్వోటీ బృందం అదుపులోకి తీసుకున్నది. సీఐ రాఘవేందర్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. ఎస్వోటీ, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఏపీకిచెందిన తాళ్లపురెడ్డి సుధీర్, తాళ్లపురెడ్డి దేముళ్లు, కేశంశెట్టి శంకర్‌రావుగా గుర్తించారు. ఏపీలోని మారుమూల ప్రాంతంలో తక్కువ ధరకు హాష్ ఆయిల్ సేకరించి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక్కడి యువతను టార్గెట్ చేస్తూ మూడు రెట్లకు ఎక్కువగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారు. వారి నుంచి 3.8 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితులు సులువుగా డబ్బు సంపాదించేందుకు తమతో పాటు తమ కుటుంబ సభ్యులు, బంధువులనూ దందాలోకి దింపారన్నారు.