calender_icon.png 23 August, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సస్పెన్స్ థ్రిల్లర్ త్రిశెంకినీ

23-08-2025 12:17:46 AM

ఎన్‌బీజే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్న సినిమా ‘త్రిశెంకినీ’. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు రంజిత్ కుమార్. పలువురు నూతన నటీ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ..

“చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెగాస్టార్ మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి. ఆయన బర్త్‌డే సందర్భంగా త్రిశెంకినీ సినిమా టైటిల్ లాంచ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అన్నారు. నటుడు, దర్శకుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. “నేను చిరంజీవి అభిమానిని. ఈ చిత్రంలో జైజై మెగాస్టార్ అనే పాట రూపొందించాం. ఆ పాట మెగాభిమానులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

మీ అందరి ఆశీర్వాదంతో మా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. నిర్మాత ఎన్ బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ “నాకు సినిమాలంటే ప్యాషన్. కృష్ణ అభిమానిని. గతంలో పాటలు కూడా రాశాను. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సరికొత్త మూవీ చేశాం” అని తెలిపారు.