05-11-2025 01:08:40 AM
బెల్లంపల్లి, నవంబర్4 : బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ ప్రాంతంలో మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను ప్రారంభించారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నుండి కాంటా చౌరస్తా వరకు 100 ఫీట్ల వెడల్పుతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే కాంత చౌరస్తాలో చిరు వ్యాపారుల దుకాణాలను జెసిబిలతో కూల్చివేశారు. రూ. 7 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపడుతున్నారు.