10-12-2025 07:13:58 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ ఐఈఈఈ సిఐఎస్ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ జాయింట్ హైదరాబాదు చాప్టర్ సంయుక్తంగా 2025 ఎడ్జ్ ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అంశంపై ప్రత్యేక నిపుణుల ఉపన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా టారామైక్రో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సిటిఓ మరుతి పతాపతి పాల్గొని ఆధునిక పరిశ్రమల్లో ఎడ్జ్ ఎఐ పాత్ర, స్మార్ట్ తయారీ సాంకేతికతలు, రియల్–టైమ్ ఎఐ ఆధారిత పరిశ్రమల పరిష్కారాలపై విద్యార్థులకు లోతైన అవగాహన అందించారు. ఈ ఉపన్యాసానికి సిఎస్ఈ ఏఐ డేటా సైన్స్ విభాగాల నుండి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన ఈ కార్యక్రమం పరిశ్రమ–అకాడమిక్ అనుసంధానాన్ని బలోపేతం చేసే ప్రభావవంతమైన వేదికగా నిలిచింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యానికి, డీన్ ప్రొఫెసర్ వి. విజయ కుమార్ కి, హెచ్ఓడి డాక్టర్ మల్లికార్జునరెడ్డికి, డాక్టర్ శ్రీదేవి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనురాగ్ యూనివర్సిటీ ఐఈఈఈ బ్రాంచ్ కౌన్సిలర్ డాక్టర్ ఎం. సంతోష్ మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ఎక్సిక్యూటివ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ రాజేశ్వరి సూచనలు సహకారానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఫ్యాకల్టీ అడ్వైజర్లు డాక్టర్ ఎం. త్రుప్తి డాక్టర్ వి. బిక్షం మార్గదర్శకత్వంలో సమన్వయం చేశారు.