10-12-2025 07:16:38 PM
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా ప్రమాదాల నివారణ, అతివేగం, వ్యక్తిగత రక్షణ పరికరాల ధరింపుపై స్థానిక కళాకారులు పీకే ఓసిలో ప్రదర్శించిన రక్షణ సందేశం నాటిక సభికులను తన్మయత్నంకు గురిచేసింది. అందరిచేత ప్రశంసలు ప్రశంసలు పొందింది. స్థానిక కళాకారుడు సింగరేణి మాజీ ఉద్యోగి నాసర్ పాషా రచన దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ కళా ప్రదర్శనలో కళాకారులు తమ పాత్రలకు జీవం పోశారు. విద్యుత్ వినియోగం, జాగ్రత్తలు, అశ్రద్ధ అనే ఇతివృతంగా సాగిన నాటిక ప్రదర్శన ఆధ్యాంతం ఆసక్తిగా కొనసాగింది. స్టేజి పైనే కార్మికుడికి విద్యుత్ ఘాతం దృశ్యం అందరిని సంబరమాశ్చర్యాలకు గురిచేసింది.
సంస్థపై బాధ్యత కలిగిన తండ్రి పాత్రలో నాసర్ పాషా, రక్షణ సూ త్రాల పట్టింపు లేని కార్మికునిగా జంగంరాజ్ కుమార్ చక్కని నటనను ప్రదర్శించారు. విధి నిర్వహణ పట్ల, అప్రమత్తత సంస్థ పట్ల అంకిత భావం, కుటుంబ బాధ్యతలు లిగిన కార్మికులుగా జర్పుల రాము, కోడి రెక్కల శ్రీనివాస్, నరసయ్య, చింతలశంకర్, సందీప్ లు చక్కని అభినయంతో నటించి తమ పాత్రలకు జీవం పోశారు. ప్రదర్శనలకు మరింత వన్నె తెచ్చే విధంగా ఆర్కెస్ట్రా బృందం రక్షణ గీతాలు అలపించగా కీబోర్డ్ ఎస్ డేవిడ్ రాజ్, రిథమ్ ప్యాడ్ డి ప్రవీణ్, ఫ్లూటు నరసయ్య చక్కని వాయిద్య సహకారం అందించారు. ఏరియా జిఎం దుర్గం రామచందర్, రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ సిహెచ్ వెంకటరమణ, అధికారులు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కళాకారులను నాట్య ప్రతిభను అభినందించారు. అనంతరం ముఖ్య అతిధులు కళాకారులను ప్రశంసిస్తూ జ్ఞాపికలను అందజేశారు. సింగరేణిలో కళాకారులకు కొదవలేదని ప్రశంసించారు. సింగరేణి ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఈ ప్రదర్శనను తిలకించారు.