11-07-2025 10:32:21 PM
ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ఫ్లెక్సీ కి పాలాభిషేకం
కోదాడ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని పలువురు బీసీ సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెరిక కల్యాణ మండపంలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం మంత్రివర్గం తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకురావడానికి నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంఘం డివిజన్ అధ్యక్షులు కాసాని శివ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.