calender_icon.png 23 May, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు

23-05-2025 02:15:07 AM

మణుగూరు, మే 22 (విజయక్రాంతి) హనుమాన్ జయంతి సందర్భంగా మణుగూరు మం డలంలోని హనుమాన్ టెంపుల్లో పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు  గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఆలయాన్ని దర్శించిన ఎమ్మెల్యే  హనుమంతుడికి అభిషేకం జరిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హనుమంతుడు భక్తి, శక్తి, నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తాడని, అందరూ ఆయన్నిలా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆయన భగవంతుణ్ని ప్రార్థించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ పీరినాకి నవీన్, టౌన్ ప్రెసిడెంట్ శివ, సైదులు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, సామ శ్రీనివాస్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.