28-07-2025 12:17:04 AM
నల్గొండ క్రైమ్, జూలై 26: ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన యువకుని కోసం భర్తని వద్దనుకొని 15 నెలల కుమారుడిని నల్గొండ బస్టాండ్‌లో వదిలేసి ప్రియుని వద్దకు చేరింది ఈ సంఘటన శనివారం చోటు చేసుకోగా ఆదివారం నల్గొండ టూ టౌన్ పోలీస్ లు బాలుని తల్లిదండ్రులకు అప్పగించారు హైదరాబాద్‌కు చెందిన బాలమనితో నల్గొండ పట్టణంలోని పాత బస్తి కీ చెందిన యువకునితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది 15 నెలల బాలుని తీసుకొని నల్గొండ బస్టాండ్ కు చేరింది.
బస్టాండ్ లో బాలుని వదిలేసి ప్రియునికి ఫోన్ చేయడంతో అతను వచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. బాలుడు మమ్మీ..అంటూ ఏడవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. నల్గొండ టూ టౌన్ పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన క్రమంలో బాలుడు తల్లిని గుర్తించి మమ్మీ అంటూ ఏడ్చాడు. దీంతో బైక్ నెంబర్ ఆధారంగా బాలుఢీ తల్లిని ప్రియున్ని గుర్తించారు .
బాలుడి తల్లి తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు కుమారుని అప్పగించారు. శనివారం రాత్రి బాలున్ని బాలసదనంలో, బాలుడి తల్లిని సఖి కేంద్రంలో ఉంచారు. ప్రియుని కోసం కుమారుని బస్టాండ్‌లో వదిలివేసి విషయమై పలు రకాలు గా చర్చించుకుంటున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.