calender_icon.png 28 July, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

28-07-2025 12:15:21 AM

హుజూర్నగర్,జూలై 27: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని వందేమాతరం పౌండేషన్ సభ్యులు,ఆయష్ యోగా శిక్షకులు బేతం రామాంజిరెడ్డి అన్నారు. ఆదివారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా పట్టణంలో 28 వార్డులలో మొక్కలు నాటడం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.

మాజీ కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు మాట్లా డుతూ రోజు రోజుకు క్షీణించిపోతున్న పర్యావరణానిన్న కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.మీ ఇంటితో పాటు మీ పరిసర ప్రాంతాల్లో  ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.పుట్టినరోజులు,పెళ్లిరోజులకు గుర్తుగా ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలన్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భానోత్  ప్రసాద్,చందా ప్రసాద్,ఓరుగంటి రాజ్యలక్ష్మి,నూకల లక్ష్మమ్మ,మట్టపల్లి రజిత,ఓరుగంటి హైమారాణి,సావిత్రి, జానకి, తదితరులు, పాల్గొన్నారు.