07-11-2025 12:00:00 AM
అమెరికా వాణిజ్య రాజధానిగా పేరున్న న్యూయార్క్ నగర మేయర్‌గా భారతీయ మూలాలున్న జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ పెట్టుబడిదారుల రాజధాని అయిన న్యూయార్క్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఒక సోషలిస్టు తన అసమాన పోరాటంతో విజయం సాధించడం గొప్ప విషయం. అయితే జొహ్రాన్ మమ్దానీని ఓడించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ సామాన్యులు, కార్మిక సంఘాలు మాత్రం మమ్దానీ పక్షానే నిలిచి ఆయనను గెలిపించారు.
అయితే దీనిని ట్రంప్ వర్సెస్ మమ్దానీగా చూడకూడదు. మమ్దానీ విజయం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఏడాది నుంచి చూసుకుంటే న్యూయార్క్‌లో జీవన వ్య యం (కాస్ట్ ఆఫ్ లివింగ్) కష్టతరంగా మారింది. న్యూయార్క్ వాసుల్లో నా లుగో వంతు ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఆహారం కొనుక్కోలేని స్థితిలో ఉన్నామని, అద్దెలు భరించలేని స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. 2023లో న్యూయార్క్ నగరం పేదరికం రేటు జాతీయ సగటు కంటే రెట్టింపుగా ఉండడం,
ఇది రెండు సంవత్సరాల్లో ఇది 7 శాతం పెరగడం గమనార్హం. మరోవైపు నగరంలో బిలీయనీర్ల సంఖ్య క్ర మంగా పెరుగుతూ వస్తున్నప్పటికీ వారి వల్ల తమకు ఒరిగేదేమీ లేదని స్థానికులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మమ్దానీ చేసిన వాగ్ధానాలు ఆయ న విజయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పొచ్చు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తాను మేయర్‌గా ఎన్నికైతే అద్దెలను తగ్గిస్తానని, అద్దెల పెరుగదలను 3 శాతానికి మించకుండా నియంత్రించడం, పిల్లల సంరక్షణను, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీలిచ్చారు.
అం తేకాదు న్యూయార్క్‌లో బస్సులను ఉచితం చేయడానికి అందుకు కావాల్సిన నిధుల కోసం మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం ఉన్నవారిపై 2 శా తం పన్ను విధిస్తామని పేర్కొనడం, కార్పొరేట్ సబ్సీడీలను తగ్గిస్తామని మమ్దానీ చేసిన ప్రతిపాదనలు కూడా ఓటర్లను ఆకర్షించాయి. ఈ నేపథ్యం లో సోషలిస్టు అయిన జొహ్రాన్ మమ్దానీకి ఒక అవకాశమిస్తే పరిస్థితులు మారే అవకాశముందని ప్రజలు భావించారు.
మరోవైపు అమెరికా చట్టసభ సభ్యుల మధ్య కీలక బిల్లులపై సయోధ్య కుదరకపోవడంతో 36 రోజులుగా అక్కడ షట్‌డౌన్ కొనసాగుతోంది. ఇది అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి షట్‌డౌన్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవ స్థ బలహీనంగా మారుతుందనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది.
ఇప్పటికే షట్‌డౌన్ కారణంగా ఆర్థికంగా 90 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు లెక్క తేల్చింది. షట్‌డౌన్ కారణంగా అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ప్రధానంగా వాణిజ్య రాజధానిగా పేరున్న న్యూయార్క్‌పై ఈ షట్‌డౌన్ ప్రభావం తీవ్రం గా ఉండడంతో ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీగా ప్రకటించుకుంది.
ఇన్ని సమస్యల మధ్య న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ విజయం మెచ్చుకోదగినదే. మమ్దానీతో పాటు న్యూజెర్సీ, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లుగా, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మైక్ షెరిల్, అబిగెయిల్ స్పాన్ బెర్గర్, హైదరాబాద్ మూలాలున్న గజాలా హష్మీ విజయాలు సాధించడం అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ బలాన్ని పెంచినట్లయింది.