29-10-2025 05:12:32 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ స్ట్రోక్ పక్షవాత దినోత్సవం వైద్యులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. వైద్యులు మనోజ్ భరత్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యులు వైద్య సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించిన వైద్యులు. పక్షవాతం రావడానికి గల కారణాలను నివారణ పద్ధతులను రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దామెర రాములు డాక్టర్ కృష్ణంరాజు యోగేష్ కుమార్ నరసింహారెడ్డి వైద్య సిబ్బంది నేరెళ్ల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.