29-10-2025 05:15:49 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు గవర్నర్ ఆమోదముద్ర. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరో ఘనతను తన ఖాతాలో వేసుకోవడం జరిగిందని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానికసంస్థలు ఎన్నికలకు వెళ్తానని నమ్మగర్భంగా చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలతో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అట్టి గెజిట్ ను చట్టబద్ధత కోసంపార్లమెంటుకు.
గవర్నర్కు పంపించడం జరిగింది. కొంతకాలం ఆలస్యమైనప్పటికీ కొన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని నానా రాద్ధాంతం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లితన చిత్తశుద్ధిని ఈరోజు నిరూపించుకుంది ఎగతాళి చేసిన ప్రతిపక్ష పార్టీ నాయకులు .కవులు కళాకారులు . మరియుమేధావులు విమర్శించిన వారు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనకేయకుండా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు కొట్టు వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. 50% రిజర్వేషన్ క్యాప్ ను తొలగించి కొద్ది రోజుల్లో స్థానికుల స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వముముఖ్యమంత్రి రాష్ట్రమంత్రివర్గం. శాసనసభ్యులసమిష్టి కృషి ఫలంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏదైతే తన నోటి గుండా హామీ ఇచ్చారో ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వమ్ము చేయకుండా అమలు దిశగా పనిచేసిన ఘనత రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని మడమతిపని ఏకైక పార్టీ. ఆరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేసి నిరూపించిన ఘనతకాంగ్రెస్ పార్టీది.