29-01-2026 12:40:36 AM
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
సంగారెడ్డి/పటాన్‌చెరు, జనవరి 28 (విజయక్రాంతి): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్ధనూర్‌లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాల యాల కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాపన చేశా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీ కృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తున్నామన్నా రు. మొదటి విడతగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లను ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయించామని తెలిపారు. భూభారతి ద్వారా ఎక్క డ రిజిస్ట్రేషన్ జరిగినా ఒకే ప్లాట్‌ఫారంలో భూమి వివరాలు, సరిహద్దులు, నిషేధిత సర్వే నెంబర్ల వివరాలు లభించేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
కొత్త యాప్ ద్వారా డబుల్, ట్రిపుల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు, అక్రమ రిజిస్ట్రేష న్లు జరుగకుండా ఉంటుందని స్పష్టంచేశారు. భూధార్ కార్డు పూర్తయ్యాక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. భూ సమ స్యలు తగ్గితే జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి మరింతగా వస్తాయని మంత్రి తెలిపారు.మరో మంత్రి గడ్డం వివేక్ మాట్లాడుతూ రాష్ట్రానికి పటాన్‌చెరు పారిశ్రామిక హబ్‌గా మారిందని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకురావాలంటే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో రిజిస్ట్రేష న్లు, స్టాంప్స్ శాఖ కమిషనర్ రాజీవగాంధీ హనుమంతు కూడా మాట్లాడారు. కార్యక్రమం లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్టార్లు, ఆర్డీఓ, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి, రాజ పుష్ప ఇంఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.