calender_icon.png 25 December, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరవాన్ని సంపాదించే అంశాలు

24-12-2025 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

పూజ్యా విద్యాబుద్ధి పౌరుషాభిజన కర్మాతిశయతశ్చ పురుషాః!

 (కౌటిలీయం - 3-3)

విద్య, బుద్ధి, పౌరుషం, చేస్తున్న పని.. వీటి అతిశయాన్ని బట్టి మనుషులకు మర్యాద ఇవ్వాలి, అంటాడు ఆచార్య చాణక్య. సమాజ వికాసంలో బోధన, పరిశోధన, శిక్షణ, కార్యాచరణల ప్రాధాన్యతలను గుర్తించాడు చాణక్య. బో ధన, శిక్షణల వల్ల వ్యక్తిలో క్రమశిక్షణ కలుగుతుందని.. తద్వారా ధర్మచింతన, సత్యవ ర్తన వెలుగుచూస్తుందని, భౌతికంగా సం పద సృజింపబడి అభివృద్ధి సాధ్యపడుతుందని భావించాడు. మానవ విలువలు, అభ్యుదయమే దేశ ప్రగతికి, జాతి సుగతికి గీటు రాళ్ళుగా భావించాడాయన.

వ్యక్తి ఉ న్నతియే సమాజ ఉన్నతికి, తద్వారా దేశాభ్యుదయానికి బాటలు వేస్తాయి. సమస్య లకు సరైన పరిష్కారాలను చూపేదే విద్య. పౌరుల విద్యా సామర్ధ్యాలు దేశ విలువల కు దర్పణంగా నిలుస్తాయి. ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికదే సోపానమౌతుంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. విద్య పై పెట్టిన ప్రతిపైసా లాభాలను ఆర్జిస్తుం ది. చుట్టూ ఉండే ప్రపంచాన్ని, పరిస్థితులను అవగాహన చేసుకోవడం, సాంకేతిక విలువలను పెంచుకోవడం..

చేసే పని యొక్క ప్రయోజనాన్ని గుర్తించడానికి వి ద్య ఉపయుక్తమౌతుంది. విద్యను విజ్ఞాన శాస్త్రంగా పరివర్తన చెందించిన దేశాల్లో తయారీరంగంలో.. నాణ్యతతో కూడిన ఉ త్పత్తులు, ఉత్పాదకతలు పెరిగాయి. వ్యవసాయరంగంలో ఉత్పత్తులు పెరిగి ఆహార భద్రత నెలకొన్నది. రైతుల ఆదాయమూ పెరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నాణ్యతలు సాధింపబడ్డాయి. విద్యవల్ల క్రమశిక్షణ, క్రమశిక్షణ వల్ల వినయ విధేయతలు, విచక్షణా శక్తి, ఉత్సాహం, ఆ లోచనలో పరిణతి వెలుగుచూస్తాయి.

ని జానికి సరైన ఆలోచనయే దైవం. విద్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేదిగా ఒకప్పుడు గురుకులాల్లో ‘అధీతి, బోధ, అవ గతం, ప్రచా రం’ మార్గాల ద్వారా వెలుగుచూసేది. అధీ తి అంటే అధ్యయనం చేయ డం.. విస్తృతంగా చదవడం, వినడం వల్ల జ్ఞానం పెరు గుతుంది; బోధ వల్ల ‘ఎందుకు? ఏమిటి?’ అనేది అవగాహన కుదురుతుంది. వివిధ కోణాల్లో విషయాన్ని అవగాహన చేసుకోవడం, పరీక్షించడం వల్ల ప్రయోజనం అవ గతమౌతుంది.

విషయం ఆచరణ యోగ్యమౌతుంది; దానితో నైపుణ్యాలు పెరుగు తాయి. అప్పుడది ప్రచారానికి యోగ్యమౌతుంది.. ప్రచారంలో స్పురించిన మార్పు లు, చేర్పులు, దిద్దుబాట్లు ఆధునీకరణకు ఉపకరించేవి. అలా విద్యా సామర్ధ్యాలు ఉన్నతీకరింపబడి సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దేవి.

శక్తి సామర్థ్యాలు..

విద్యా సామర్ధ్యాల వల్ల బుద్ధి వికసిస్తుం ది. నిజానికి అంతర్గత మనసు నిశ్ఛయాత్మక భాగాన్ని బుద్ధిగా వ్యవహరిస్తారు. బు ద్ధి వికసన వల్ల సమయస్పూర్తి, తెలివితేటలు, వివేకం, విచక్షణ, ఆలోచనాశక్తి పెరు గుతుంది. బుద్ధి, జ్ఞానాల వల్ల ప్రజ్ఞ వికసిస్తుంది. మంచి చెడులను వివేకంతో యోచించి, సరైన నిర్ణయాలు, సరైన సమయంలో తీసుకునే అంతర్గత శక్తి సామ ర్ధ్యాలు వెలుగుచూస్తాయి. సమస్యలను పరిష్కరించడమూ, కొత్త అంశాలను నేర్చుకోవడమూ, విశ్లేషణ చేసుకోవడమూ జరుగుతుంది.

సుఖ దుఃఖాలకు పొంగిపోవడం, కుంగిపోవడం కాకుండా సమ దర్శన అలవడుతుంది. పౌరుషం అంటే సంకల్ప బలం, లక్ష్యసాధనలో ముందుకు సాగే ధైర్యసాహసాలు, కష్టనష్టాలకు చెదరని స్థిత ప్రజ్ఞత, పట్టుదల వీడని ప్రయ త్నం, మానసిక దృఢత్వం, సంయమనతలుగా చెపుతారు. ఆచరించని జ్ఞానము, నై పుణ్యాలు, వివేచనలు నిరుపయోగంగా ప రిణమిస్తాయి. అవకాశం పలకరించిన స మయంలో దానిని అందిపుచ్చుకొని సరి గా ఉపయోగించుకున్న వ్యక్తులే మార్గదర్శకులౌతారు. వారి మార్గమే ఇతరులకు ఆచ రణ యోగ్యమౌతుంది.

ప్రక్రియ ఆధారం గా ముందుకు సాగే పౌరుషం కలిగిన వ్య క్తులు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. విద్య, బుద్ధి, పౌరుషం కలిగిన వ్యక్తిలో జాత్యంతరీకరణ జరుగుతుంది. జాతి అంటే స్థాయి. దాని తో చేసే పనిలో పారదర్శకత, ప్రావీణ్యత, ఉత్పాదకత పెరుగుతాయి. అవే ప్రగతికి, సుగతికి మూలాధారాలవుతాయి. అలాంటి వ్యక్తులను సమాజం గౌరవించి, ఉన్నత స్థితికి చేరుస్తుంది. దేశం గౌరవం ఇనుమడిస్తుంది.

ఆర్థిక ఎదుగుదల..

నేడు ఆయుధాలతో చేసే యుద్ధాల క న్నా వాణిజ్య యుద్ధాలే గెలుపోటములను నిర్ణయిస్తున్నాయి. ఆర్థిక ఎదుగుదలయే దేశాన్ని శక్తివంతంగా నిలుపుతుంది. అయి తే ఆర్థికంగా ఎదిగేందుకు వ్యక్తులూ, దేశా లు తప్పుడు మార్గాలను వెతుకుతున్నా యి. చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కుతున్నాయి. వాణిజ్యం న్యాయంగా లేదు..స్వేచ్ఛగా లేదు. ఒకదేశంపై మరొక దేశం విధించే సుంకాలే ఆయుధాలయ్యా యి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ను రక్షించుకోవాలి. దానికి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి.

పౌరులు ధార్మికులైతే సరిపోదు.. కార్మికులూ కావా లి. ప్రాంతీయ ప్రతిభను బలోపేతం చేయ డం, ఎగుమతులను ప్రోత్సహించడం అవసరం. ప్రపంచ వాణిజ్యంలో భారత్ 25వ స్థానంలో ఉన్నది. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల ఉపాధి సృష్టియే కాక, దేశ స్వావలంబనకు, ఎగుమతుల వృద్ధికి ఉపకరిస్తుంది. హ్యూరున్ ఇండి యా లిస్ట్-2025 ప్రకా రం ‘ఎటర్నల్’ కం పెనీ యజమాని దీపేందర్ గోయల్ 3.2 లక్షల కోట్ల విలువతో భారతదేశంలో ‘సెల్ఫ్ మేడ్ బిలియనీర్ల’ మూడో జాబితాలో ముందున్నాడు. అలాంటి ఔత్సా హిక పారిశ్రామిక వేత్తలను ఆదరించడం వల్ల దేశ ఆర్థిక ప్రగతి సుస్థిరమౌతుంది.

‘మేక్ ఇన్ ఇండియా’..

రాష్ట్రాలు సంక్షేమాలపై చూపే శ్రద్ధను అభివృద్ధిపై చూపడం లేదు. పరిమితులను మించి ఋణాలను సేకరిస్తున్నాయి. ఋణాల స్థాయి పెరగడం ఆందోళనకరం. డాలర్ మారకంలో రూపాయి పతనం ఆందోళనకరమే అయినా నిత్యావసర వ స్తువుల ధరల సెగ లేనంత వరకూ ఆందోళన అవసరం లేదని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్ప డం కొంత ఊరటనిస్తున్నా దిగుమతులపై దాని భారం పడుతుంది. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉంటాయని, దీనిలో రాజీపడేది లేదు.

ప్రభుత్వ నిర్ణయాలు సేవారంగాన్నీ బలోపేతం చేస్తూ, తయారీరంగానికి చేయూతనిస్తే ‘మేక్ ఇన్ ఇండియా’ దశ సాధ్యపడుతుంది. అనంతకాలం భారత్ ప్రపంచానికి ఆధిపత్యం వహించాలి అనుకుంటే, చాణక్య చెప్పిన విధంగా ‘విద్య, బుద్ధి, పౌరుషం, చేస్తున్న పనిలో పరిణతి ప్రాముఖ్యతను గుర్తించాలి. ఆత్మనిర్భరతకు, సాంకేతిక ప్రగతికి, ఆర్థిక స్థిరత్వానికి పెద్దపీట వేస్తూ.. అవసరమైన వనరులు, వసతులు ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే ‘వికసిత భారత్’ స్వప్నం సాకారమౌతుంది.