28-01-2026 12:26:36 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జనవరి 27 (విజయక్రాం తి): ఓయూ వీసీ కుమార్ నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు.
ఇటీవల ఓయూలో నిర్వహించిన కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్(సీఏఎస్) ఇంటర్వ్యూలలో అన్ని అర్హతలు, ఏపీఐ స్కోర్లు, యూజీసీ నిబంధనలను కలిగిఉన్న 47 మంది అధ్యాపకులను తిరస్కరించడం తీవ్ర ఆందోళన కలిగి స్తోందన్నారు. తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తిరస్కరించిన అధ్యాపకులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రొ. మనోహర్‌ను సస్పెన్షన్ చేయడం సరికాదని, తక్షణమే సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ సస్పెన్షన్ అయిన మనోహర్‌రావుపై నిజనిర్ధారణ కమిటీ వేసి సస్పెన్షన్‌ను రద్దు చెయ్యా లన్నారు. వీసీ కుమార్ నిర్ణయాల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ సీనియ ర్ నాయకురాలు ఇందిరా శోభన్ విమర్శించా రు. ఈ సమావేశంలో ఔటా నేతలు ప్రొ.బి.సు రేందర్ రెడ్డి, డా.రామకృష్ణ, ప్రొ.వెంకట్ దాసు, ప్రొ.నటానియల్, ప్రొ.జి.లక్ష్మణ్, ప్రొ.వినాయక్ రెడ్డి, ప్రొ.మనోహర్, డా.పరశురామ్, డా.టి.రాందాస్, డా.విజయేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.